రంగస్థలం రికార్డులపై కన్నేసిన మహర్షి..!

May 18, 2019


img

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి సినిమా వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నైజాంలో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసేలా కనిపిస్తుంది. నైజాంలో రంగస్థలం సినిమా 27.76 కోట్ల దాకా కలెక్ట్ చేసి టాప్ 3లో ఉంది. మొదటి రెండు స్థానాలు బాహుబలి 1, 2 ఉన్నాయి. 

ఇక ఇప్పుడు మహర్షి రిలీజైన 10 రోజుల్లోనే నైజాం లో 22.05 కోట్ల వసూళ్లను రాబట్టింది. మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా 22.32 కోట్ల వసూళ్లను సాధించింది. మహర్షి దూకుడు చూస్తుంటే నైజాంలో రంగస్థలం కలక్షన్స్ కూడా బీట్ చేసేలా ఉంది. మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి నిజంగానే ల్యాండ్ మార్క్ కలక్షన్స్ తో మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష