వరుణ్ తేజ్ కు షాక్ ఇచ్చిన పూజా

May 15, 2019


img

ప్రస్తుతం స్టార్ హీరోలందరితో నటిస్తున్న పూజా హెగ్దె లేటెస్ట్ గా వచ్చిన మహర్షి హిట్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. మహర్షి హిట్ జోష్ లో ఉన్న పూజా.. త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఇదే కాకుండా పూజా హెగ్దె వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న వాల్మీకి సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందని అన్నారు. ఆ సినిమా కోసం 15 రోజులకు అమ్మడు 2 కోట్ల దాకా డిమాండ్ చేసిందని వార్తలు రాశారు. కాని ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.

వాల్మీకి సినిమాకు పూజా హెగ్దె ఓకే చెప్పలేదట. చిన్న సినిమా అని చేయనందా లేక వరుస స్టార్స్ తో నటిస్తూ ఇప్పుడు యువ హీరో అనుకుందో ఏమో కాని వరుణ్ ఛాన్స్ ను మిస్ చేసుకుంది పూజా హెగ్దె. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన జిగుర్తండా సినిమా రీమేక్ గా వాల్మీకి సినిమా వస్తుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ కూడా నటిస్తున్నాడు. మరి పూజా ప్లేస్ లో ఈ ప్రాజెక్ట్ లోకి ఎవరు వస్తారో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష