బాలయ్య ఎవరిని వదిలిపెట్టడే.. ఈసారి ఆరెక్స్ బ్యూటీతో..!

May 15, 2019


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను సెలెక్ట్ చేశారట. ఇంతకుముందు ఈ సినిమాలో హరిప్రియ హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. సో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారన్నమాట. ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను తన అందచందాలతో కట్టిపడేసిన పాయల్ కు తెలుగులో మంచి ఛాన్సులు వస్తున్నాయి. 

తన సినిమాలో హీరోయిన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకునే బాలయ్య ఈసారి ఆరెక్స్ భామతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యాడు. టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడీ కట్టిన బాలకృష్ణ పాయల్ తో జతకట్టడం అమ్మడికి కలిసి వచ్చే అంశమే. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న వెంకీమామ సినిమాలో అమ్మడు నటిస్తుంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఛాన్స్ కొట్టింది. చూస్తుంటే పాయల్ సీనియర్ స్టార్స్ కు బెస్ట్ ఆప్షన్ కానుందని తెలుస్తుంది. 


Related Post

సినిమా స‌మీక్ష