పటాస్ షోకి శ్రీముఖి గుడ్ బై..!

May 15, 2019


img

యాంకర్ శ్రీముఖి అనగానే గుర్తొచ్చే షో పటాస్. రవితో పాటుగ అడల్ట్ కామెడీతో సాగే ఆ షోతో శ్రీముఖి మంచి క్రేజ్ తెచ్చుకుంది. కొన్నాళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఆ షో నుండి అర్ధాంతరంగా శ్రీముఖి తప్పుకుంటుందని తెలుస్తుంది. శ్రీముఖి స్వయంగా తన సోషల్ బ్లాగ్ ద్వారా పటాస్ కు కొద్దిగా బ్రేక్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అయితే దానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం చెప్పలేదు.

పటాస్ లో శ్రీముఖి యాంకరింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లందరికి ఇది తప్పకుండా చేదువార్తే.. శ్రీముఖి బదులుగా పటాస్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి. కేవలం శ్రీముఖి ఒక్కతే వెళ్తుందా రవి కూడా పటాస్ కు గుడ్ బై చెబుతాడా అన్నది చూడాలి. ఈటివి కామెడీ షోగా పటాస్ బాగా పాపులర్ అయ్యింది. జబర్దస్త్ తో పోటీ పడకున్నా పటాస్ కూడా సక్సెస్ ఫుల్ షోగా సూపర్ హిట్ అయ్యింది.   Related Post

సినిమా స‌మీక్ష