ఇస్మార్ట్ శంకర్ టీజర్.. పూరి మార్క్ మాస్..!

May 15, 2019


img

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి కసితో తీస్తున్న సినిమా ఇది. రామ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. పూరి మార్క్ మాస్ మసాలా మూవీగా ఈ సినిమా వస్తుందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.    

ఈమధ్య సినిమాల్లో అంశాలు యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా చూస్తున్నారు. అందులో భాగంగానే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ఊర మాస్ డైలాగ్స్ తో మెప్పించారు. సినిమా అంతా రామ్ ఎనర్జీ చాలా ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ టీజర్ తోనే తన ప్రతిభ కబరచిన పూరి సినిమాను ఎలా తీశాడో చూడాలి. రామ్ మాత్రం ఇంతవరకు తను చేసిన సినిమాల్లో ఎప్పుడూ ఇంత రఫ్ గా కనిపించలేదు.    

Related Post

సినిమా స‌మీక్ష