ఆ హీరోయిన్ తో విజయ్ దేవదరకొండ పెళ్లి..!

May 14, 2019


img

టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు మన రౌడీ హీరో. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. అయితే సినిమాలో నటిస్తున్న ఈ ఇద్దరిలో ఐశ్వర్య రాజేష్ తో విజయ్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడని విజయ్ ఆమెను పెళ్లాడేందుకు కూడా సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై విజయ్ రెస్పాండ్ అవలేదు కాని ఐశ్వర్య రాజేష్ రిప్లై ఇచ్చింది. తనకి ఎవరితోనో పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి. అతనెవరో తనకి తెలుసుకోవాలని ఉందని అన్నది. తన జీవితం సింగిల్ గా చాలా సంతోషంగా ఉన్నదని.. అలాంటిది ఏదైనా జరిగితే తానే స్వయంగ మీకు చెబుతా అంటూ ట్వీట్ చేసింది. ఈమధ్య తమిళంలో మంచి సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా ఛాన్సులు అందుకుంటుంది. 90వ దశాబ్ధంలో హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత విలన్ గా.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రాజేష్ కూతురే ఐశ్వర్య రాజేష్.   Related Post

సినిమా స‌మీక్ష