ఎన్.టి.ఆర్ బయోపిక్ నేను చేసుంటే..!

May 14, 2019


img

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తండ్రి బయోపిక్ గా ఆయన ఎన్.టి.ఆర్ సినిమా చేశారు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాలు వచ్చాయి. అయితే రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేదు. పెద్దాయన బయోపిక్ పై చాలా హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ అంతా నిరాశపడ్డారు. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు.

అసలైతే ఈ సినిమాకు దర్శకుడిగా తేజ సెలెక్ట్ అవగా.. భారీగా ఓపెనింగ్ కూడా చేశారు. కాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయడం తన వల్ల కాదని తేజ ఆ ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. అయితే క్రిష్ చేస్తే సినిమా డిజాస్టర్ అయ్యింది ఒకవేళ తేజ చేసి ఉంటే ఎలా ఉండేదని ఆలోచన వచ్చింది. సీత సినిమా ప్రమోషన్స్ లో తేజ ను ఎన్.టి.ఆర్ బయోపిక్ కు సంబందించిన ప్రశ్నలు అడిగారు.

వాటన్నిటికి సమాధానంగా తేజ ఆన్సర్ ఇస్తూ.. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు సినిమాలు తాను చూడలేదని.. చూడని సినిమా గురించి మాట్లాడలేనని అన్నారు. అంతేకాదు ఒకవేళ తాను చేసి ఉంటే ఇంతకంటే దారుణంగా తీసేవాడినేమో అని అన్నారు. ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ న్యూస్ గా మారిన తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ విషయంలో మాత్రం నోరు జారడం లేదు. ఆయన డైరక్షన్ లో వస్తున్న సీత సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష