జబర్దస్త్ లో మీనా.. సంఘవి..!

May 14, 2019


img

ఏపి ఎలక్షన్స్ కోసం జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చారు నాగబాబు, రోజా. నాగబాబు వచ్చే ఛాన్సులు ఉన్నా ఈసారి రోజా ఎమ్మెల్యేగా గెలిస్తే జబర్దస్త్ చేయకపోవచ్చు అన్న టాక్ వచ్చింది. కాని చూస్తే సడెన్ గా జబర్దస్త్ లో రోజా ప్రత్యక్షమైంది కాని నాగబాబు ఇంకా రాలేదు. ఆయన ప్లేస్ లో మీనాని తీసుకొచ్చారు. గత 3 వారాలుగా మీనా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కబడుతుంది.

ఇదిలాఉంటే మీనా ప్లేస్ లో లేటెస్ట్ గా సంఘవి సర్ ప్రైజ్ ఇచ్చింది. మీనాకు వర్క్ ఉండి రాలేదా లేక నాగబాబు వచ్చేదాకా ఇలా సీనియర్ హీరోయిన్స్ ను తీసుకుంటున్నారా అన్నది తెలియదు కాని జబర్దస్త్ లో మీనా, సంఘవిల సందడి బాగుంది. ఎంతైనా ఒకప్పటి అందాల తారలు కదా చాలా గ్యాప్ తర్వాత రియాలిటీ షోలో చూడటం బుల్లితెర ఆడియెన్స్ కు భలే థ్రిల్ కలిగిస్తుంది. మరి సంఘవి అయినా ఉంటుందా లేక ఆమె కూడా గెస్ట్ గా వచ్చి వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష