వినాయక్ ను హీరో చేస్తున్న దిల్ రాజు..!

May 14, 2019


img

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ క్రేజీ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరక్టర్ వినాయక్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే వినాయక్ తో సినిమా అంటే వినాయక్ డైరక్షన్ లో అనుకుంటే పొరబడినట్టే. ఈ సినిమాలో వినాయక్ హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. నిర్మాత రాజుని దిల్ రాజుగా మార్చిన వినాయక్ ప్రధాన పాత్రలో ఎన్. నరసింహ రావు డైరక్షన్ లో సినిమా వస్తుందట. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. 

డైరక్టర్ గా చిన్నపాటి బ్రేక్ ఇచ్చి కెమెరా ముందుకొచ్చి యాక్టింగ్ చేయాలని చూస్తున్నాడు వి.వి.వినాయక్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. హీరోలు తమ సినిమాను తామే డైరెక్ట్ చేయడం చూశాం కాని డైరక్టర్ ఫుల్ టైం హీరోగా మారాలని అనుకోవడం మాత్రం కొత్తగా ఉంది. వినాయక్ ఈ న్యూ టర్న్ తన కెరియర్ కు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.      Related Post

సినిమా స‌మీక్ష