ఆరెక్స్ డైరక్టర్ ఏదో తేడా కొడుతుందే..!

May 13, 2019


img

ఆరెక్స్ 100 సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న అజయ్ భూపతి ఆ సినిమా తర్వాత రామ్, నితిన్ లతో డిస్కషన్స్ జరిపాడు. అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు అతనితో సినిమా చేస్తాడని అనుకోగా అది మిస్సైంది. అయితే ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ఆరెక్స్ డైరక్టర్ సినిమా అని వార్తలు వచ్చాయి. అతను కాదన్నాడో లేక ఏమో కాని అటు నుండి ఆ స్టోరీ అక్కినేని కాంపౌండ్ కు వచ్చింది. ఇక చైతుతో అజయ్ భూపతి సినిమా కన్ఫాం.. హీరోయిన్ గా సమంత కూడా నటిస్తుందని అనుకునేసరికి మళ్లీ అక్కడ వ్యవహారం ఏదో బెడిసి కొట్టిందట.       

ఇక ఫైనల్ గా అజయ్ భూపతి మాస్ మహరాజ్ రవితేజతో ఆ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మహా సముద్రం అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లొచ్చింది. మరి రవితేజతో అయినా సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇంతమంది హీరోల దగ్గర కథ ఒప్పించగలిగినా అతను అడిగిన బడ్జెట్ ఇవ్వట్లేదని సినిమా ఆగుతుందట. మరి రవితేజతో ఈ సినిమా ఎందాకా వెళ్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష