సాహో కోసం ప్రభాస్ అందుకు సిద్ధం..!

May 13, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సాహో సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహో సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందుకే హింది వర్షన్ డబ్బింగ్ కూడా తానే చెప్పాలని నిర్ణయించుకున్నాడట. మన సినిమాలు హిందిలో రిలీజైన డబ్బింగ్ మాత్రం మన వాళ్లు చేయరు కాని సాహోకి హింది వర్షన్ డబ్బింగ్ కూడా ప్రభాస్ చేస్తారని తెలుస్తుంది. కచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది మరో గిఫ్ట్ అన్నట్టే. ఆగష్ట్ 15న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికి వరకు రిలీజైన మేకింగ్ వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.   Related Post

సినిమా స‌మీక్ష