కబీర్ సింగ్ ట్రైలర్.. డిటో దించేశాడుగా..!

May 13, 2019


img

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. విజయ్ కు యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేలా సినిమా అది. ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా ఆదిత్య వర్మ అని వస్తుండగా హిందిలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ అని తెరకెక్కుతుంది. 

తెలుగు దర్శకుడు సందీప్ వంగ హింది వర్షన్ డైరెక్ట్ చేయడం విశేషం. మొన్నామధ్య టీజర్ తో ఇంప్రెస్ చేసిన కబీర్ సింగ్ ఈరోజు ట్రైలర్ తో మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. సేం టూ సేం తెలుగు వర్షన్ లానే ఉన్నా షాహిద్ కపూర్ ఆ పాత్రకు న్యాయం చేశారు. సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తుంది. చూస్తుంటే హింది అర్జున్ రెడ్డి అదేనండి కబీర్ సింగ్ కూడా బాలీవుడ్ లో క్రేజీ హిట్ కొట్టేలా ఉంది. ట్రైలర్ బీ టౌన్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయగా ఇక సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష