మహేష్ 26.. విజయశాంతి క్రేజీ రోల్..!

May 11, 2019


img

సూపర్ స్టార్ మహేష్ మహర్షి ఇలా రిలీజైందో లేదో తన తర్వాత సినిమా గురించి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆల్రెడీ మహేష్ 26వ సినిమా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. జూన్ సెకండ్ వీక్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను తీసి వరుస హిట్లు కొడుతున్న అనీల్ రావిపుడి మహేష్ తో కూడా అలాంటి క్రేజీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో అలనాటి సీనియర్ స్టార్స్ విజయశాంతి, రమ్యకృష్ణ వంటి వారు నటిస్తున్నారట. ముఖ్యంగా చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయశాంతి ఈ సినిమాలో మహేష్ కు అత్త పాత్రలో నటిస్తుందట. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ క్యారక్టర్ కూడ కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. మహర్షితో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ అనీల్ రావిపుడి సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష