యువ హీరోతో సరిపెట్టుకుంది

May 10, 2019


img

కొంతమంది హీరోయిన్స్ కు హిట్లు పడినా సరే కెరియర్ లో మంచి అవకాశాలు రావు అదేంటో మరికొంతమందికి అయితే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తుంటాయి. వీటిల్లో మొదటి కేటగిరికి చెందిన హీరోయిన్ అంటే అది మెహ్రీన్ కౌర్ అని చెప్పాలి. ఎఫ్-2 తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడికి వరుస స్టార్ అవకాశాలు వస్తాయని అనుకుంటే స్టార్ ఛాన్సులు రాలేదు. అందుకే వచ్చిన సినిమాలకు ఓకే చెబుతుంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న మెహ్రీన్ కౌర్ నాగ శౌర్య సినిమాలో ఛాన్స్ పట్టేసిందట.

యువ హీరోల్లో తన టాలెంట్ తో సత్తా చాటుతున్న నాగ శౌర్య ఛలో హిట్ తో ట్రాక్ ఎక్కినట్టు కనిపించినా మనవాడు మధ్యలో మళ్లీ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఢీలా పడ్డాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న నాగ శౌర్య నూతన దర్శకుడు డైరక్షన్ లో మరో సినిమాకు లైన్ క్లియర్ చేశాడట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా మెహ్రీన్ కౌర్ ను సెలెక్ట్ చేశారట. ఈ సినిమా నాగ శౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కిస్తున్నారు. మరి ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష