బాలయ్య సినిమాలో లేడీ విలన్

May 10, 2019


img

నందమూరి బలకృష్ణ హీరోగా కె. ఎస్ రవికుమార్ డైరక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. జై సిం హా తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా హరిప్రియను తీసుకున్నారని తెలుస్తుంది. ఇక సినిమాలో విలన్ గా జగపతి బాబుని ఫిక్స్ చేశారట. అయితే సినిమాలో మరో లేడీ విలన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. కోలీవుడ్ హీరో శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ కు విలన్ గా నటిస్తుందట.

కోలీవుడ్ లో ఇప్పటికే విలన్ రోల్స్ తో సత్తా చాటుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో కూడా అలాంటి రోల్స్ కు ప్రిఫరెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్ అనగానే వరలక్ష్మి గురించి అందరు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ చేదు అనుభవాన్ని మిగిల్చగా రవికుమార్ సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు బాలయ్య బాబు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ ఉంటుందని తెలుస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష