మహర్షి రివ్యూ & రేటింగ్

May 09, 2019


img

రేటింగ్ : 3/5 

కథ :

రిషి (మహేష్ బాబు) ప్రపంచాన్నే ఏలేయాలన్న కసితో పెరిగిన వ్యక్తి. మధ్యతరగతి వ్యక్తిగా తాను లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా గెలిచాననే సంతృప్తిగా జీవించే రిషి తండ్రి. కొడుకు అనుకున్నది సాధిస్తాడనే నమ్మకంగా ఉండే అమ్మ. వైజాగ్ లో ఎం.టెక్ లో పరిచయమైన రవి (అల్లరి నరేష్). అదే కాలేజ్ లో తన క్లాస్ మెట్ అయిన పూజా. ఇలా వీళ్లందరిని కాదని ఒరిజిన్ సాఫ్ట్ వేర్ కంపెనీకి సిఈఎఓగా మారుతాడు రిషి. అయితే తండ్రి మరణం తర్వాత అతనిలో మార్పు వస్తుంది. తన లైఫ్ సక్సెస్ కు తన జీవితంలో మిగిలిన వారు చేసిన సాక్రిఫైజ్ అని గుర్తిస్తాడు. ఫైనల్ గా తన స్నేహితుడు రవి ఉండే రామవరం వెళ్లి అక్కడ బిజినెస్ మెన్ వివేక్ మిట్టల్ (జగపతి బాబు)ని ఢీ కొడతాడు. మళ్లీ సక్సెస్ కు డెఫినేషన్ గా మారుతాడు రిషి.

విశ్లేషణ :

కమర్షియల్ సినిమాల్లో సోషల్ మెసేజ్ యాడ్ చేయడం కత్తిమీద సాములాంటిది. వంశీ పైడిపల్లి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమా మొదటి భాగం మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసుకెళ్లగా ఆ తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం పల్లెటూరు.. ఆ ఊరు సమస్యల మీద నడిపించారు. సినిమా కొన్నిసార్లు మళ్లీ శ్రీమంతుడు తరహా వెళ్తున్నట్టు అనిపించినా ఎంగేజింగ్ స్టోరీతో మెప్పిస్తారు.

ముఖ్యంగా సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. రైతుల జీవితాల గురించి ప్రెస్ మీట్ లో మహేష్ చెప్పే డైలాగ్స్ అందరిని ఆలోచించే చేస్తాయి. అయితే సినిమా రన్ టైం కాస్త తక్కువ ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మహేష్, అల్లరి నరేష్ రోల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. 

రిషి.. మహర్షిగా మారగా ప్రేక్షకులు కూడా రిషి జర్నీలో భాగమవుతారని చెప్పొచ్చు. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ అందరికి నచ్చే సినిమా మహర్షి. 

నటన, సాంకేతికవర్గం :

రిషి పాత్రలో మహేష్ అదరగొట్టాడని చెప్పొచ్చు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మహేష్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్నా సరే స్టూడెంట్ గా నటించడం చాలా కష్టం. అలాంటిది ఫస్ట్ హాఫ్ మొత్తం స్టూడెంట్ గా మహేష్ మెస్మరైజ్ చేశాడు. ఇక ప్రీ క్లైమాక్స్ డైలాగ్స్ లో కూడా చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ అల్లరి నరేష్. రవి పాత్రలో నరేష్ మళ్లీ తన సత్తా చాటాడు. సినిమాలో నరేష్ నటనకు మంచి మార్కులు పడతాయి. పూజా హెగ్దె ఓకే అనిపిస్తుంది. ఇక సినిమాలో రావు రమేష్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. మోహనన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓకే అనిపించుకుంది. సాంగ్స్ లో పదర.. పదర.. ఇదే కదా ఇదే కదాతో పాటుగా మరో సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టాడు. సినిమా డైరక్టర్ వంశీ పైడిపల్లి కథ, కథనాల్లో తన ప్రతిభ చాటాడు. అయిత్ రన్ టైం ఒకటి కాస్త ఎక్కువనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించారు.

ఒక్కమాటలో :

మహేష్ 'మహర్షి'.. రిషి సక్సెస్ స్టోరీ..! 

 


Related Post

సినిమా స‌మీక్ష