నితిన్ కు జోడీ కడుతున్న రకుల్..!

April 22, 2019


img

యువ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని తన సినిమాల వేగం పెంచాడని చెప్పొచ్చు. ప్రస్తుతం నితిన్ ఛలో ఫేం వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా నితిన్ క్రియేటివ్ డైరక్టర్ చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట.

స్పైడర్ తర్వాత వన్ ఇయర్ పాటు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేని రకుల్ ఇప్పుడు మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే మన్మథుడు 2లో నాగార్జున సరసన జోడీ కడుతున్న రకుల్ నితిన్ సరసన ఛాన్స్ పట్టేసింది. తెలుగు, తమిళంలోనే కాదు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది రకుల్. మరి తెలుగులో చేస్తున్న ఈ సినిమాలైనా అమ్మడికి హిట్లు వస్తాయో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష