జెర్సీ పై రాజమౌళి కామెంట్.. నాని బాబు లవ్ యు..!

April 22, 2019


img

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 19 శుక్రవారం రిలీజై మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది జెర్సీ. ఇక ఈ సినిమా చూసిన తారక్, అల్లు అర్జున్ నానిని, గౌతం ను చిత్రయూనిట్ ను ప్రశంసించారు.

ఇక లేటెస్ట్ గా నాని జెర్సీపై రాజమౌళి ట్వీట్ చేశాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందని సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు గర్వపడేలా చేశారని. హృదయాన్ని హత్తుకునేలా సినిమా ఉందని దర్శకుడు గౌతం తిన్ననూరి ప్రతిభకు వల్ డన్ అని అన్నారు రాజమౌళి. ఫైనల్ గా నాని బాబు లవ్ యు అంతే అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. జక్కన్న ట్వీట్ తో జెర్సీ సినిమాకు మరికొంత క్రేజ్ వచ్చింది. ఈమధ్య సినిమాలకు తన కామెంట్ పెట్టని రాజమౌళి నాని జెర్సీ సినిమా గురించి ప్రస్థావించడం విశేషం.



Related Post

సినిమా స‌మీక్ష