నాని జెర్సీ రివ్యూ & రేటింగ్

April 19, 2019


img

రేటింగ్ : 3.5/5

కథ :

అర్జున్ (నాని) ఇండియా టీంకు ఆడాలని కలలుకన్న క్రికెటర్ కాని రంజీ నుండి కెరియర్ ఆపేసి ఎఫ్.సి.ఐ లో జాబ్ చేస్తుంటాడు. అయితే ఆ జాబ్ లో కూడా కొన్ని కారణాల వల్ల సస్పెన్షన్ లో ఉంటాడు. ప్రేమించి పెళ్లాడిన సరా (శ్రద్ధ శ్రీనాథ్) సంపాదన మీద ఆధారపడుతున్న అర్జున్ తన కొడుకు బర్త్ డేకి ఇండియా క్రికెట్ జెర్సీ కొనివ్వాలని అనుకుంటాడు. ఇంతలో పదేళ్ల క్రితం తను కాదనుకున్న క్రికెట్ ఆడే ఛాన్స్ వస్తుంది. ఇంతకీ అర్జున్ ఎందుకు క్రికెట్ వదిలేశాడు..? అతను ఫైనల్ గా ఏం చేశాడు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

మళ్లీ రావా సినిమాతో ప్రతిభ చాటిన గౌతం తిన్ననూరి జెర్సీ సినిమాతో కూడా సత్తా చాటాడు. ఎంచుకున్న కథను ఎమోషనల్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. అర్జున్ పాత్రలో నాని నటన అద్భుతం. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆ పాత్రని ఓన్ చేసుకుంటారు. తెర మీద కనిపించేది అర్జున్ కథ కాదు తమ కథ అని ప్రతి ఒక్క ఆడియెన్ అనుకునేలా చేశారు.

రాసుకున్న కథకు కథనం అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించిన ప్రీ క్లైమాక్స్ లో సినిమా అదరగొట్టారు. సినిమా మొత్తం ఎమోషనల్ జర్నీగా నడిపించడంలో దర్శకుడు అన్నివిధాలుగా సక్సెస్ అయ్యాడు. కథనం నమ్మదిగా సాగినా ప్రేక్షకుల మనసులు మాత్రం గెలిచేలా ఉంటుంది. 

నటన, సాంకేతికవర్గం :

నాని నాచురల్ స్టార్ అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అర్జున్ పాత్రలో పతి సీన్ లో జీవించేశాడు. నవ్వడం.. ఏడవడం.. బాధ.. విజయం ఇవన్ని అర్జున్ పాత్ర ద్వరా నాని పలికించిన తీరు బాగుంది. రొటీన్ సినిమాలే చేస్తున్నాడు అని మార్క్ పడ్డ నానికి ఈ సినిమా కొత్త ఇమేజ్ తెస్తుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగానే చేసింది. సత్యరాజ్, మాస్టర్ రోనిత్, సంపత్, ప్రవీన్ ఇలా సినిమాలో నటించిన అందరు బాగా చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. సాను సినిమాటోగ్రఫీ అలరించింది. అనిరుధ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ముఖ్యంగా బిజిఎం అదరగొట్టాడు. సినిమాకు మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. కథ, కథనాల్లో దర్శకుడు చాలా క్లవర్ గా హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. 

ఒక్కమాటలో :

నాని జెర్సీ.. మనసుని కదిలించే సినిమా..!


Related Post

సినిమా స‌మీక్ష