విజయ్ దేవరకొండ 'గల్లీ బోయ్'

April 18, 2019


img

రన్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గల్లీ బోయ్. తక్కువ బడ్జెట్ తో రిలీజైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దాదాపు ఈ సినిమా 230 కోట్ల దాకా వసూళు చేసింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు రీమేక్ చేయాలని చూస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గల్లీ బోయ్ రీమేక్ లో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా చేస్తాడని అన్నారు.

కాని ఆ ఛాన్స్ లేదని అతనే డైరెక్ట్ గా చెప్పాడు. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం గల్లీ బోయ్ గా కనిపించేది రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని తెలుస్తుంది. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ అయితేనే గల్లీ బోయ్ సినిమాకు పర్ఫెక్ట్ అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండిటి తర్వాత గల్లీ బోయ్ రీమేక్ చేస్తే అవకాశం ఉందని చెప్పొచ్చు.   

   


Related Post

సినిమా స‌మీక్ష