గుమ్మడికాయ కొట్టిన మహర్షి..!

April 18, 2019


img

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజై సూపర్ హిట్ అయ్యాయి.

గురువారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇదే విషయాన్ని వెళ్లడిస్తూ మహేష్ మహర్షి ఇట్స్ ఏ ర్యాప్ అని ఉన్న కేక్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశాడు. మహేష్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. రిలీజ్ కు ఇంకా 3 వారాలు టైం ఉంది కాబట్టి ఇక ప్రమోషన్స్ కూడా మొదలు పెడతారని తెలుస్తుంది.    Related Post

సినిమా స‌మీక్ష