టైగర్ కె.సి.ఆర్.. అగ్రెసివ్ గాంధి.. వర్మ మరో సెన్సేషన్..!

April 18, 2019


img

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ నిన్న మొన్నటిదాకా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి చేసిన రచ్చ తెలిసిందే. ఏపి ఎలక్షన్స్ టైంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఉందని ఏపిలో సినిమా రిలీజ్ కాకుండా చేశారు. ఇక ఆ సినిమా ఏపిలో వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడితే లేటెస్ట్ గా వర్మ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. తెలంగాణా రాష్ట్ర సాధకుడు తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బయోపిక్ మొదలు పెట్టాడు.

కె.సి.ఆర్ బయోపిక్ కు టైటిల్ గా టైగర్ కె.సి.ఆర్ అని పెట్టాడు వర్మ. ట్యాగ్ లైన్ గా ది అగ్రెసివ్ గాంధి అని కూడా పెట్టాడు. తెలంగాణా తెస్తనంటే అందరూ నవ్విండ్రు అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు. మొత్తానికి ఆర్జివి మరో సంచనలానికి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు. ఆంధ్రా పాలకుల చేతుల్లో అన్యాయమవుతున్న తెలంగాణా ప్రజల ఆశయ సాధనకు నడుం బిగించి, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ఉద్యమం చేసిన కె.సి.ఆర్ జీవిత చరిత్ర సినిమాగా రావడం అది కూడా వర్మ లాంటి డైరక్టర్ చేయాలని అనుకోవడం విశేషం.    

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కె.సి.ఆర్ బయోపిక్ గా ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఒకటి ఉద్యమ సింహం కాగా మరోటి తెలంగాణా దేవుడు అంటూ తీశారు. అవేవి పెద్దగా బజ్ ఏర్పరచుకోలేదు. ఉద్యమ సింహం ఈమధ్యనే డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. తెలంగాణా దేవుడు ఇంకా రిలీజ్ చేయలేదు. మరి బయోపిక్ లకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఆర్జివి తను చేస్తున్న ఈ టైగర్ కె.సి.ఆర్ ఎలా చేస్తాడో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష