సెకండ్ హాఫ్ కాకుండానే సెట్స్ మీదకు వచ్చారా..!

April 17, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 24న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అయ్యారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ పూర్తి కాకుండానే సెట్స్ మీదకు వెళ్లిందని అంటున్నారు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో త్రివిక్రం మీద పూర్తి నమ్మకం ఉంచిన బన్ని ఈ సినిమా స్క్రిప్ట్ సెకండ్ హాఫ్ పూర్తి కాకుండానే షూటింగ్ కు వెళ్తున్నారట. అయితే ఇప్పటికే బన్నికి ఓ వర్షన్ చెప్పినా అది బాగాలేదని చెప్పడంతో మార్చి రాస్తున్నాడట త్రివిక్రం. మొత్తానికి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లేకుండానే బన్ని సినిమా పట్టాలెక్కడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాకు అలకనంద అనే  టైటిల్ పెట్టబోతున్నారని సమాచారం.     Related Post

సినిమా స‌మీక్ష