శంకర్ డైరక్షన్ లో మెగాస్టార్

April 17, 2019


img

ఖైది నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇదే కాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో మెగా మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా సౌత్ క్రేజీ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియన్-2 సినిమా చేస్తున్న శంకర్ ఆ తర్వాత సినిమా చిరుతోనే ఉంటుందని తెలుస్తుంది.

శంకర్.. చిరంజీవి.. ఈ కాంబినేషన్ లో సినిమా కొన్నాళ్లుగా ట్రై చేస్తున్నా సరే వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా ఈ కాంబో సెట్ అయ్యింది. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ప్లాన్ చేసిన శంకర్ చిరుతో సినిమా కూడా అలాంటి కథతో వస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ స్టోరీ లైన్ ఓకే అవగా సినిమా గురించి త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. మరి అల్లు అరవింద్, శంకర్, చిరంజీవి ఈ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష