పవన్ మెచ్చిన 'చిత్రలహరి'

April 17, 2019


img

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచిన సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిమించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 12న రిలీజైన ఈ సినిమా సాయి తేజ్ వరుస ఫ్లాపుల నుండి బయట పడేసింది. ఇప్పటికే చిత్రలహరి సినిమా గురించి పొగుడుతూ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన వీడియో మెగా ఫ్యాన్స్ ను మెప్పించింది.

ఇక ఇప్పుడు చిత్రలహరి సినిమా గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. మేనళ్లుడు చిత్రలహరి సినిమా చూసిన పవన్ కళ్యాణ్ చిత్రయూనిట్ కు బొకెలు పంపించాడు. డియర్ సర్ కంగ్రాట్స్, మీ సినిమా చూసి ఎంతో ఆస్వాదించాను అంటూ పవన్ ఆ బొకెలతో పాటు మెసేజ్ కూడా పంపించాడు. పవన్ పంపించిన స్పెషల్ గ్రీటింగ్స్ కు మైత్రి మూవీ మేకర్స్ రెస్పాన్స్ గా థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు.  Related Post

సినిమా స‌మీక్ష