యూట్యూబ్ ఛానెల్స్ పై పూనం కౌర్ ఫిర్యాదు..!

April 16, 2019


img

పూనం కౌర్.. హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకోలేని ఈ అమ్మడు తన చుట్టూ వివాదాలు మాత్రం సృష్టించుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పూన కౌర్ రిలేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగింది. కత్తి మహేష్ పవన్ ను టార్గెట్ చేసే క్రమంలో పూనం కౌర్ గురించి కొన్ని విషయాలు ప్రస్థావించాడు. ఆ గొడవ సర్ధుమనిగింది అనుకుంటే ఈమధ్య సోషల్ మీడియాలో పూనం కౌర్ ఆడియో టేపులు హల్ చల్ చేశాయి.  

పవన్ తనని ఎలా నమ్మించి మోసం చేశాడో పూనం వాయిస్ తో ఉన్న ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇప్పటికి సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు పెట్టి తనని మానసికంగా వేధిస్తున్నారని పూనం కౌర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తనపై ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వ్యక్తులు కావాలని ఇలాంటి అసభ్యకరమెన పోస్టులు పెడుతున్నారని తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.     

పూనం కౌర్ ఏభై యూట్యూబ్ ఛానెల్స్ పై ఫిర్యాదు చేశారు పూనం. అంతేకాదు తనకు అనుమానం ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులకు సమాచారం అందించారని తెలుస్తుంది. తన పరిస్థితి మరో అమ్మాయికి రాకూడదని పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది. నిందుతులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తారని పూనం కౌర్ కోరారు.      



Related Post

సినిమా స‌మీక్ష