అభినేత్రి 2.. ఒకటి కాదు రెండు దెయ్యాల కథ..!

April 16, 2019


img

ప్రభుదేవ, తమన్నా జంటగా విజయ్ డైరక్షన్ లో వచ్చిన అభినేత్రి సినిమాకు సీక్వల్ గా వస్తున్న సినిమా అభినేత్రి 2. ఈసారి ఒక దయ్యం కాదు రెండు దెయ్యాలతో ఈ సినిమా కథ నడుస్తుంది. అభినేత్రి 2 టీజర్ ఈరోజు రిలీజైంది. ప్రభుదేవ, తమన్నా ఇద్దరు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. నిమిషం కన్నా తక్కువగా ఉన్న అభినేత్రి 2 టీజర్ మెప్పించింది. ఇక ప్రభుదేవ మార్క్ కామెడీ, డ్యాన్స్ అదరగొట్టేయడం ఖాయమని తెలుస్తుంది.

టీజర్ చూస్తే కథ ముందే తెలిసిపోతున్నా టీజర్ అంత గొప్పగా ఏం లేదని చెప్పొచ్చు. రెగ్యులర్ హారర్ కామెడీ సినిమాగా వస్తున్న అభినేత్రి 2 మే 1న రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా, ఇషారి కె గణేష్, ఆర్. రవింద్రన్ నిర్మిస్తున్నారు.    





Related Post

సినిమా స‌మీక్ష