సౌత్ లో కాజలే టాప్.. ఆమె తర్వాతే ఎవరైనా..!

April 16, 2019


img

దశాబ్ధ కాలం పైగా హీరోయిన్ గా సౌత్ లో స్టార్ స్టేటస్ కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ ఎంతమంది పరిచయమవుతున్నా సరే కాజల్ మాత్రం ఇంకా టాప్ లీగ్ లోనే ఉంది. ఒక్క తెలుగులోనే కాదు సౌత్ అంతటా కాజల్ తర్వాతే ఎవరైనా అది ఏ లెక్కలో అంటే ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లో అని తెలుస్తుంది. సౌత్ అందరిలో కాజల్ అగర్వాల్ కే 10 మిలియన్ ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్నారు.

మిగతా హీరోయిన్స్ అంతా 7 మిలియన్ ఫాలోవర్స్ కు దరిదాపుల్లో ఉండగా కాజల్ మాత్రం 10 మిలియన్ క్రాస్ చేసింది. కోలీవుడ్ లో నయనతార సోలో సినిమాలతో అదరగొడుతున్నా కాజల్ కే ఇన్ స్టా ఫాలోవర్స్ ఎక్కువ ఉండటం విశేషం. కొన్నాళ్ల క్రితం కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు అనిపించినా మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150తో మళ్లీ అమ్మడు ఫాంలోకి వచ్చింది. ఇప్పటికి స్టార్ ఛాన్సులతో పాటుగా యువ హీరోలతో జోడీ కడుతున్న కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సీత సినిమా చేస్తుంది. ఆ సినిమాలో కూడా అమ్మడు అదరగొట్టడం ఖాయమని తెలుస్తుంది. కాజల్ తర్వాత 7.3 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సమంత  6.5 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష