చిత్రలహరికి మెగాస్టార్ కాంప్లిమెంట్స్..!

April 15, 2019


img

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా చిత్రలహరి. వరుసగా 6 ఫ్లాపులు ఖాతాలో వేసుకుని కెరియర్ సందిగ్ధంలో ఉన్న తేజ్ కు ఈ సినిమా ఫలితం చాలా ప్రాధాన్యతగా మారింది. అయితే ముందునుండి సినిమాపై హోప్స్ పెట్టుకున్న తేజ్ ఫైనల్ గా చిత్రలహరితో హిట్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రలహరి 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవగా మొదటి మూడు రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 7.75 కోట్ల వసూళ్లను సాధించింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా ఫ్యాన్స్ కు మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించారు మైత్రి మూవీ మేకర్స్. సినిమా చూసిన చిరు చిత్రయూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కిశోర్ ఈ సినిమాను చాలా సెటిల్డ్ మెసేజ్ తో తెరకెక్కించాడని.. దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడని అన్నారు. ఇక తేజూ కూడా నటుడిగా చిత్రలహరిలో తన ప్రతిభ చాటాడని.. మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో చక్కగా నటించాడని కితాబిచ్చారు. పరిణితి సాధించిన నటుడిగా తేజ్ నటన బాగుందని.. పోసాని, సునీల్ ఇతర నటీనటులంతా వారి పాత్రల్లో చక్కగా నటించి సినిమాకు నిండుతనం తెచ్చారని అన్నారు. దేవి శ్రీ అద్భుతమైన మ్యూజిక్ అందించాడని. సక్సెస్ ఫుల్ సినిమాలకు మైత్రి మూవీస్ అడ్రెస్ గా మారిందని అన్నారు. వారి బ్యానర్ ప్రతిష్ట నిలబెట్టెలా ఈ సినిమా రూపొందిచారని అన్నారు. ముఖ్యంగా బంధాలు, బాంధవ్యాల గురించి తండ్రి కొడుల అనుబంధం గురించి చల్లగా చూపించారని.. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధించడానికి కృషితో ముందుకెళ్లాలని చిత్రలహరి సినిమా చెప్పిందని. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా చిత్రయూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. 

Related Post

సినిమా స‌మీక్ష