నాని 'జెర్సీ' బయోపిక్ కాదు

April 15, 2019


img

నాచుర్ల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. సత్యరాజ్ కూడా సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే నాని ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులను మెప్పించింది. 36 ఏళ్లకు తన క్రికెట్ కల నెరవేర్చుకునేందుకు హీరో ఎంత కష్టపడ్డాడు అన్నది జెర్సీ కథ.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో జెర్సీ ఇండియన్ ప్లేయర్ రమణ్ లాంబా బయోపిక్ అని వస్తున్న కామెంట్స్ కు రెస్పాన్స్ అయ్యాడు నాని. రమణ్ లాంబా కూడా ప్రొఫెషనల్ క్రికెట్ కు బ్రేక్ ఇచ్చి ముప్పై ఐదేళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. అయితే ఢాకా మ్యాచ్ లో బంతి అతని కణతికి తగిలి మృతి చెందారు. జెర్సీ సినిమాలో కూడా నాని చివర్లో చనిపోతాడని వచ్చిన వార్తలని బట్టి ఈ సినిమా రమణ్ లాంబా జీవిత కథే అన్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇది గౌతం తిన్ననూరి కల్పిత కథే అని క్లారిటీ ఇచ్చాడు నాని. సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడు. ట్రైలర్ చూస్తే సినిమా పక్కా హిట్టు కొట్టేలా ఉంది. మరి నాని జెర్సీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 4 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.  Related Post

సినిమా స‌మీక్ష