రజిని రిటైర్మెంట్ అప్పుడేనా..!

April 13, 2019


img

సూపర్ స్టార్ రజినికాంత్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రజినికాంత్ మురుగదాస్ డైరక్షన్ లో దర్బార్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత కూడా వినోద్ డైరక్షన్ లో మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆ సినిమానే రజిని చివరి సినిమా అవుతుందని అంటున్నారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి రాజకీయాల మీద దృష్టి పెడతారని తెలుస్తుంది.    

ఇప్పటికే కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ పెట్టి దూసుకెళ్తున్నారు. ఆయన కూడా ఇండియన్-2 సినిమా తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అన్నారు. రజిని కూడా వరుస సినిమాలు చేసేది అందుకే అని తెలుస్తుంది. రజిని సినిమాలు ఆపేస్తే అన్న ఆలోచన ఫ్యాన్స్ కు రుచించకపోయినా తప్పదు.. కమిటైన సినిమాలన్ని కానిచ్చేసి ఇక పూర్తిగా పాలిటిక్స్ మీద దృష్టి పెడతారట రజినికాంత్. సినిమాల్లో సూపర్ హిట్ అయిన రజిని కెరియర్ పొలిటికల్ గా ఎలా సాగుతుందో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష