సాయి తేజ్ 'చిత్రలహరి' ఫస్ట్ డే కలక్షన్స్..!

April 13, 2019


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అలియాస్ సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఏప్రిల్ 12 శుక్రవారం రిలీజైంది. మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రలహరి తెలుగు రెండు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించుకుంది.

అయితే ఓవర్సీస్ ఆడియెన్స్ మాత్రం ఈ సినిమాను తిప్పికొట్టారు. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా మొదటిరోజు కలక్షన్స్ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి.

చిత్రలహరి మొదటి రోజు కలక్షన్స్ ఎలా ఉన్నాయో వాటి వివరాలు చూస్తే.. 

నైజాం : 0.79 కోట్లు 

సీడెడ్ : 0.51 కోట్లు 

ఈస్ట్ : 0.38 కోట్లు 

వెస్ట్ : 0.24 కోట్లు 

గుంటూరు : 0.30 కోట్లు 

నెల్లూరు : 0.14 కోట్లు 

కృష్ణా : 0.24 కోట్లు 

ఏపి/తెలంగాణా : 3.02 కోట్లు  

 

 


Related Post

సినిమా స‌మీక్ష