మజిలీ ఫస్ట్ వీక్ కలక్షన్స్.. చైతు కెరియర్ బెస్ట్ హిట్..!

April 13, 2019


img

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా మజిలీ. షైన్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. సమంతతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 5న రిలీజైన మజిలీ మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన మజిలీ మంచి వసూళ్లను రాబడుతుంది. రియల్ లైఫ్ భార్యాభర్తలైన నాగ చైతన్య, సమంతల ఆన్ స్క్రీన్ పెయిర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా వసూళ్లు చైతు కెరియర్ లో బెస్ట్ గా నిలించేలా ఉన్నాయి. వారం రోజుల్లో మజిలీ 26 కోట్ల పైగా షేర్ సాదించింది. సినిమా అన్ని చోట్ల లాభాల పంట పండించింది.

వారం రోజులు ఏరియా వైజ్ మజిలీ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి : 


నైజాం : 9.05 కోట్లు  

సీడెడ్: 2.82 కోట్లు

ఉత్తరాంధ్ర: 3.07 కోట్లు

కృష్ణ: 1.45 కోట్లు

గుంటూరు: 0.63 కోట్లు

ఈస్ట్ : 1.30 కోట్లు

వెస్ట్: 0.99 కోట్లు

నెల్లూరు:  0.57 కోట్లు

ఎపీ/ తెలంగాణా : 20.88 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.50 కోట్లు

ఓవర్సీస్: 2.75 కోట్లు

వరల్డ్ వైడ్ : 26.13 కోట్లు  

 

 


Related Post

సినిమా స‌మీక్ష