మహర్షి నువ్వే సమస్తం సాంగ్..!

April 12, 2019


img


సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా నుండి మొదటి సాంగ్ చోటి చోటి బాతె సాంగ్ రిలీజైంది. సెకండ్ సాంగ్ గా నువ్వే సమస్తం సాంగ్ రిలీజ్ అయ్యింది.

దేవి మార్క్ ట్రెండీ మ్యూజిక్ తో వచ్చిన ఈ సాంగ్ లో డిఎస్పి తన మ్యాజిక్ చూపించాడు. దిల్ రాజు చెప్పినట్టుగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని టచ్ చేసేలా ఉంటుందని సాంగ్స్ వింటేనే తెలుస్తుంది. ఈమధ్య రిలీజైన టీజర్ సంచలనం సృష్టించగా మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని  చెబుతున్నారు. మరి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

Related Post

సినిమా స‌మీక్ష