సమంత.. ఉపాసన.. ఇద్దరూ ఇద్దరే..!

April 11, 2019


img

ఒకరు అక్కినేని కోడలు అయితే.. మరొకరు మెగా కోడలు.. వారి కెరియర్ లో ఉన్నత స్థానాల్లో ఉన్న వీరు శక్తివంతమైన మహిళలని చెప్పొచ్చు. హీరోయిన్ గా సమంత అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో పాటుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇక మరోపక్క ఉపాసన కూడా తనకు తోచిన సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ బాధ్యతలతో పాటుగా బీ పాజిటివ్ ఎడిటర్ గా కూడా చేస్తుంది ఉపాసన.

బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ను ఈ మేగజైన్ కవర్ పేజ్ లో ఉంచారు. లేటెస్ట్ గా ఏప్రిల్ మేగజైన్ కు అక్కినేని కోడలు సమంత కవర్ పేజ్ కు ఎక్కింది. హెల్త్, ఫిట్ నెస్ కు సంబందించిన టిప్స్ ఇచ్చే ఈ మేగజైన్ కోసం సమంతను స్వయంగా ఉపాసన ఇంటర్వ్యూ చేయడం విశేషం. కార్యక్రమంలో భాగంగా జరిగిన ఫోటో షూట్ లో సమంత పాల్గొనగా ఆ పిక్స్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసింది ఉపాసన. బీ పాజిటివ్ మ్యాగజైన్ లో స్వీటెస్ట్ స్ట్రాంగెస్ట్ సమంత.. టాలీవుడ్ లో ఉత్తమ కోడలు అవార్డు సమంతాకే దక్కుతుందని ఉపాసన ట్వీట్ చేయడం విశేషం.     Related Post

సినిమా స‌మీక్ష