టాలీవుడ్ స్టార్ తో కె.జి.ఎఫ్ డైరక్టర్..!

April 11, 2019


img

కె.జి.ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని యశ్ ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కె.జి.ఎఫ్ సినిమా చూసిన తెలుగు ఆడియెన్స్ కూడా అతని ఫ్యాన్స్ గా మారారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ కన్నడ పరిశ్రమలో ఐదేళ్ల లో చేసింది రెండే రెండు సినిమాలు అందులో ఒకటు ఉగ్రం రెండోది కె.జి.ఎఫ్ చాప్టర్ 1. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.      

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటించే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం సాహో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఆ సినిమాతో పాటుగా రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ రెండిటిని పూర్తి చేసుకున్నాక ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తాడట. మరి కె.జి.ఎఫ్ డైరక్టర్ తో ప్రభాస్ చేసే ఆ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష