ఆర్.ఆర్.ఆర్ లో సెకండ్ హీరోయిన్ ఎవరు..?

April 10, 2019


img

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి డైసీ ఎడ్గర్ జోన్స్ ఎక్సిట్ అయ్యింది. పూణె షెడ్యూల్ లో ఆమె పాల్గొనాల్సి ఉండగా డేట్స్ అడ్జెస్ట్ కాలేదని చెప్పి డైసీ రాజమౌళికి హ్యాండ్ ఇచ్చింది. అయితే ఆమె ప్లేస్ లో ఇప్పుడు ఎవరిని తీసుకోవాలా అన్న ఆలోచనలో పడ్డాడు రాజమౌళి. సీతారామరాజుగా నటిస్తున్న రాం చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుంది.  

కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్ చేస్తున్నాడు.. తారక్ కు జోడీగా చేయాల్సిన డైసీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది కాబట్టి ఆమె స్థానంలో జాన్వి కపూర్, శ్రద్ధా కపూర్ పేర్లను పరిశీలిస్తున్నారట. శ్రద్ధా కపూర్ ఆల్రెడీ ప్రభాస్ తో సాహో సినిమా చేస్తుంది. ఆమె డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా ఉంటే మొదట ప్రిఫరెన్స్ ఆమెకే అని అంటున్నారు. ఒకవేళ శ్రద్ధా కపూర్ ఖాళీగా లేకుంటే మాత్రం జాన్వి కపూర్ ను తీసుకునే అవకాశం ఉందట.    

రాజమౌళి ఇదవరకు ఏ సినిమాకు షూటింగ్ టైంలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. కాని ఆర్.ఆర్.ఆర్ మాత్రం 2020 జూలై 31 రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. అందుకే అనుకున్న టైంకు రావాలి అంటే సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగాలి. ఇప్పటికే రాం చరణ్ కాలికి గాయమవడం వల్ల 3 వారాలు షూటింగ్ క్యాన్సిల్ చేశారు. మరి ఆర్.ఆర్.ఆర్ అనుకున్న డేట్ కు వస్తుందా లేదా అన్నది మాత్రం చెప్పలేం.

 


Related Post

సినిమా స‌మీక్ష