జెర్సీని 20 సార్లు చూశాడట.. నాని ఇది టూమచ్..!

April 10, 2019


img

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఓ క్రికెటర్ కథతో వస్తుంది. 30 ఏళ్లు దాటాక క్రికెట్ కోసం హీరో ఎంతకష్టపడ్డాడు అన్నది జెర్సీ కథ. ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. తన కెరియర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ మూవీ అని తనకు ఎంతగా నచ్చింది అంటే ఇప్పటివరకు ఈ సినిమాను తాను 20 సార్లు చూశానని అంటున్నాడు నాని.

ఎవరి సినిమా గురించి వాళ్లు గొప్పగా చెప్పుకోవడం కామనే కాని రిలీజ్ తర్వాత తేడా వస్తే మాత్రం ఈ కామెంట్స్ పై రివర్స్ ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు సినిమాలతో నిరాశ పరచిన నాని ఈసారి గట్టి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. నాని జెర్సీ అది సాధ్యమయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష