సూర్యకాంతం రివ్యూ & రేటింగ్

March 29, 2019


img

రేటింగ్ : 2.5/5

కథ :

అభి (రాహుల్ విజయ్) ఓ మంచి కుర్రాడు.. అతనికి సూర్యకాంతం (నిహారిక) పరిచయం అవుతుంది. సూర్యకాంతం చలాకీతనం చూసి ఆమెను ఇష్టపడతాడు అభి, సూర్యకాంతం కూడా అభిని ప్రేమిస్తుంది. సడెన్ గా అభికి చెప్పకుండా కాంతం ఎక్కడికో వెళ్తుంది. సూర్యకాంతం కోసం అభి ఎదురుచూస్తాడు. అలా ఏడాది గడుస్తుంది. అభి పేరెంట్స్ అతనికి పూజా (పర్లీన్) తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. అభి పూజా దగ్గరవుతున్న టైంలో సూర్యకాంతం తిరిగి వస్తుంది. అభి, సూర్యకాంతం, పూజా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ముందుకు సాగింది. అభి ఫైనల్ గా ఎవరిని ఓకే చేశాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

సినిమా కథ రొటీన్ గానే అనిపిస్తుంది. అయితే దర్శకుడు ప్రణీత్ ఫ్రెష్ గా ఈ కథను డీల్ చేశాడు. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ పంథాలో సాగినా పర్వాలేదు అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం నిహారిక తన భుజాన వేసుకుని సినిమా నడిపించింది. నిహారిక పాత్ర ఇంట్రడ్యూస్ అయ్యే వరకు కాస్త స్లోగా అనిపిస్తుంది. 

ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మరీ స్లో అయ్యిందనిపిస్తుంది. కథ తెలిసిందే అయినా కథనంలో కూడా దర్శకుడు మ్యాజిక్ చేయలేకపోయాడు. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో ప్రతిభ చాటిన ప్రణీత్ ఫీచర్ మూవీగా చేసిన సూర్యకాంతం టేకింగ్ పరంగా ఓకే అనిపించుకున్నా కథ, కథనాలు ప్రేక్షకుడు ఆల్రెడీ ఇదవరకు సినిమాల్లో చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. 

నిహారిక ఇదవరకు చేసిన రెండు సినిమాల్లో సైలెంట్ రోల్స్ చేయగా సూర్యకాంతం టైటిల్ కు పూర్తి న్యాయం చేస్తూ అదరగొట్టింది. అయితే దర్శకుడు స్టోరీ, స్క్రీన్ ప్లేలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.

నటన, సాంకేతికవర్గం :

నిహారిక సూర్యకాంతం పాత్రలో అదరగొట్టింది. తనలోని టాలెంట్ మొత్తం బయటపెట్టేలా సూర్యకాంతంలో నిహారిక నటన ఉంది. సినిమాలో హీరోగా నటించిన రాహుల్ విజయ్ కూడా అభి పాత్రలో ఇంప్రెస్ చేశాడు. పూజా పాత్రలో పెర్లీన్ కూడా మెప్పించింది. స్క్రీన్ పై గ్లామర్ తో పాటు.. యాక్టింగ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసింది పూజా. సుహాసిని, శివాజి రాజా పాత్రలు మెప్పించాయి. కమెడియన్ సత్య కూడా అలరించాడు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. మార్క్ సంగీతం సోసోగానే ఉంది. హరి జాస్తి సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెస్ చేసింది. కథ, కథనాల్లో ప్రణీత్ ఇంకాస్త కొత్తదనం చూపించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

ఒక్కమాటలో :

సూర్యకాంతం.. నిహారిక మెప్పించింది కాని సినిమా..!

 



Related Post

సినిమా స‌మీక్ష