వెంకీ కూతురు పెళ్లిలో సల్మాన్ ఖాన్ సందడి..!

March 23, 2019


img

విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లి అంగరంగ వైభవంగా ప్లాన్ చేశారు. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఫిక్స్ చేశారు. లవ్ కమ్ అరేంజెడ్ మ్యారేజ్ అయిన ఈ పెళ్లి జైపూర్ లో జరుగుతుంది. శుక్రవారం జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అటెండ్ అవడం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో కొద్దిమంది అతిథులను మాత్రమే పెళ్లికి పిలిచారట. 


ఈ పెళ్లి వేడుకలో రానా, నాగ చైతన్య, సమంతలు అటెండ్ అయ్యారు. సల్మాన్ ఖాన్ అటెండ్ అవడంతో ఈవెంట్ స్పెషల్ జోష్ వచ్చింది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో భారీగా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట. రిసెప్షన్ లో మాత్రం తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులందరిని పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి హడావిడిలో ఫుల్ బిజీగా ఉన్నారు.     Related Post

సినిమా స‌మీక్ష