ఆ రీమేక్ లో బాలయ్య, రాజశేఖర్..!

March 22, 2019


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ తో బాలకృష్ణ తన తర్వాత సినిమాల విషయంలో కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ సినిమా ఎనౌన్స్ చేసినా అది సెట్స్ మీదకు వెళ్లేందుకు టైం పట్టేట్లు ఉంది. లేటెస్ట్ గా బాలయ్య బాబు ఓ తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విక్రంవేద సినిమా రీమేక్ పై బాలకృష్ణ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రం వేదలో విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా నటించగా మాధవన్ పోలీస్ పాత్రలో కనిపించాడు. బాలకృష్ణతో పాటుగా రాజశేఖర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. రాజశేఖర్ పోలీస్ పాత్రకు.. బాలకృష్ణ రౌడీ రోల్ కు సెలెక్ట్ చేశారట. మరి ఈ సినిమా తెలుగు రీమేక్ ఎవరు డైరెక్ట్ చేస్తారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష