ఈ ఒక్కసారికే నేను అధ్యక్షుడిని.. చెప్పినవన్ని చేసి చూపిస్తా..!

March 22, 2019


img

మా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఈ రెండేళ్లలో తాను చేపట్టనున్న కార్యక్రమాల గురించి ప్రస్థావించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే చేస్తామని చెప్పామో అవి తప్పకుండా చేసి చూపిస్తా అని అన్నారు నరేష్. ముందునుండి చెబుతున్నట్టుగా ఈ ఒక్క టర్మ్ తాను అధ్యక్షుడిగా ఉంటానని.. మేమంతా కలిసి ఓ మంచి లీడర్ షిప్ అందచేస్తామని అన్నారు నరేష్. నరేష్ తో పాటుగా జీవితా రాజశేఖర్, రాజశేఖర్, మిగతా నరేష్ ప్యానెల్ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.     

ఈవెంట్ లో భాగంగా కోటా శ్రీనివాస రావు తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెబుతున్న ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు నరేష్ మీద రుసరుసలాడారు. ఇక మాజి అధ్యక్షుడు శివాజి రాజా కూడా నరేష్ పేరు ఎత్తకుండా మాట్లాడటం విశేషం. కొత్త ప్యానెల్ సభ్యులకు అతిథిలుగా వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలా, కృష్ణంరాజు శుభాకాంక్షలు అందించారు.   Related Post

సినిమా స‌మీక్ష