బిగ్ బాస్ 3 ఇన్ని ట్విస్టులా..!

March 21, 2019


img

బిగ్ బాస్ లో జరిగిన రెండు సీజన్లు అయినా షో నడిచేప్పుడు హాట్ న్యూస్ గా మారాయి తప్ప షోకు ముందు ఎలాంటి హంగమా చేయలేదు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి అలా లేదు. షో హోస్ట్ గా ఎవరన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. ఎన్.టి.ఆర్ కాదని చెప్పడంతో నాగార్జున లైన్ లోకి వచ్చారని అన్నారు. అయితే నాగ్ కూడా బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు సుముఖంగా లేడని తెలుస్తుంది.

అందుకే ఈ ఆఫర్ ప్రస్తుత యువత మెచ్చే రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా ఉన్నాడు మరి అతనికి బిగ్ బాస్ చేసే వీలు కుదురుతుందా అన్నది తెలియాల్సి ఉంది. నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విజయ్ దేవరకొండ నాని తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా ప్రమోట్ అవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే విజయ్ ఓకే చెప్పాడా లేక తను కూడా హ్యాండ్ ఇచ్చాడా అన్నది తెలియాల్సి ఉంది. స్టార్ హీరోలంతా తమ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తుంది.  

 


Related Post

సినిమా స‌మీక్ష