సాహో భామ పెళ్లికి రెడీనా..!

March 20, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో సౌత్ ఆడియెన్స్ కు పరిచయం అవుతుంది శ్రద్దా కపూర్. బాలీవుడ్ లో ఆషికి 2తో అమ్మడి ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అక్కడ మంచి ఫాంలో ఉన్న శ్రద్ధా కపూర్ మొదటిసారి తెలుగు సినిమా చేస్తుంది. సాహోలో ప్రభాస్ కు సమానంగా ఆమె యాక్షన్ సీన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో చిచోరే, స్ట్రీట్ డ్యాన్సర్ సినిమాల్లో నటిస్తుంది శ్రద్ధా కపూర్.


ఇక ఈమధ్య బాలీవుడ్ భామలకు పెళ్లిల్లు బాగా అవుతున్నాయి. ఆల్రెడీ దీపికా, ప్రియాంకా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. వారి లిస్ట్ లో త్వరలోనే చేరబోతుంది శ్రద్ధా కపూర్. ఇంతకీ శ్రద్ధా లవ్ స్టోరీ ఏంటి అంటే తన చిన్ననాటి స్నేహితుడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధా కపూర్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు ఒప్పుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2020 లో శ్రద్ధా కపూర్, రోహన్ ల మ్యారేజ్ ఉంటుందని తెలుస్తుంది.      Related Post

సినిమా స‌మీక్ష