తమన్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ..!

March 20, 2019


img

మ్యూజిక్ డైరక్టర్ తమన్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఏంటని ఆశ్చర్యపోవచ్చు. బుల్లితెర మీద కూడా తమన్ సంగీతం చేస్తున్నాడా ఏంటని అనుకోవచ్చు. కాని ఇక్కడ విశేషం ఏంటంటే స్మాల్ స్క్రీన్ పై తమన్ ఓ రియాలిటీ షో జడ్జ్ గా వస్తున్నాడు. స్టార్ మా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సూపర్ సింగర్ షోకి మొదటిసారి మ్యూజిక్ డైరక్టర్ తమన్ జడ్జ్ గా ఉంటున్నాడు. ఓ పక్క వరుస సినిమాలు చేస్తున్నా సరే అప్కమింగ్ సింగర్స్ కు తన సలహాలు ఇచ్చేందుకు తమన్ స్మాల్ స్క్రీన్ కు వచ్చేస్తున్నాడు.

సూపర్ సింగర్ టాలెంట్ షోలో ప్రతిభ చూపిన వారికి సినిమాలో పాడే అవకాశాలను ఇస్తున్నారు. స్టార్ మా నివహిస్తున్న ఈ షో ఇప్పటికే కొన్ని సీజన్స్ నడిపించారు. అయితే ఈసారి సూపర్ సింగర్ జడ్జ్ గా తమన్ చేయడం షోకి ప్రత్యేకత తీసుకొచ్చింది. తమన్ ను మెప్పిస్తే ఛాన్సులు వచ్చేసినట్టే.. త్వరలో రాబోతున్న ఈ సంగీత విభావరి తెలుగు సంగీత ప్రియులను అలరించడం ఖాయమని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష