రష్మిక లిప్ లాక్.. అక్కడ ఫ్యాన్స్ ఫైర్..!

March 18, 2019


img

కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఆదివారం రిలీజైంది. స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ ఫైట్ తో ఎంట్రీ ఇచ్చి రష్మికతో గాఢ ముద్దు లాగించేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా టీజర్ చూసి కన్నడ ఫ్యాన్స్ మాత్రం రష్మిక మీద ఫైర్ అవుతున్నారు. 

కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న అక్కడ హీరో రక్షిత్ తో ప్రేమలో పడ్డది. ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన వీరు ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఇప్పుడు రష్మిక విజయ్ సినిమాలో ఇలా లిప్ లాక్స్ తో రెచ్చిపోవడం కన్నడ ఫ్యాన్స్ కు అసలు నచ్చట్లేదు. ముఖ్యంగా రక్షిత్ ఫ్యాన్స్ రష్మిక మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ ఖాతాలో మరో విజయం చేరేలా చూస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా మే 31న రిలీ ఫిక్స్ చేశారు.         Related Post

సినిమా స‌మీక్ష