లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ను అడ్డుకోలేం..!

March 16, 2019


img

రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో వస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాపై సోషల్ మీడియాలో హంగామా తెలిసిందే. సినిమా చంద్రబాబుకి వ్యతిరేకంగా తీస్తున్నారని టిడిపి శ్రేణులు ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత అందులో ఏదైనా ఎలక్షన్ కోడ్ కు వ్యతిరేకంగా.. ఏ పార్టీకైనా అనుకూలంగా ఉంటే చర్యలు చేపట్టే అవకాశం ఉంది అంతేకాని రిలీజ్ కాకుండా అడ్డుకోలేమని ఈసీ రజత్ కుమార్ అన్నారు.

సో మార్చి 22న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అని ఫిక్స్ అవ్వొచ్చు. అయితే టిడిపి నేతలు సినిమాపై కోర్ట్ లో పిటీషన్ వేస్తామని చెబుతున్నారు. ఇదిలాఉంటే వారిని మరింత రెచ్చగొట్టేలా కడపలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఆడియో వేడుక ప్లాన్ చేశాడు ఆర్జివి. ఇక ఆ ఈవెంట్ కు వెన్నుపోటు అలియాస్ ఎన్.టి.ఆర్ నైట్ అని పోస్టర్స్ రిలీజ్ చేశాడు. ప్రతి విషయాన్ని ప్రమోషన్ గా వాడుకోవడంలో వర్మ తర్వాతే అని మరోసారి ప్రూవ్ అయ్యింది.  



Related Post

సినిమా స‌మీక్ష