సాహో ఇంటర్వల్ సీన్ కోసం అన్ని కోట్లా..!

March 15, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. 

హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో అంటూ వచ్చిన మేకింగ్ వీడియోస్ రెండూ సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆగష్టు 15న రిలీజ్ అవనున్న ఈ సినిమా ఇంటర్వల్ సీన్ కోసం ఏకంగా 30 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అబుదాబిలో జరిగే ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

సినిమా బడ్జెట్ మొత్తంలో 90 కోట్లు యాక్షన్ సీన్స్ కోసమే ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సాహో సినిమా ఆ సినిమా రేంజ్ కు తగినట్టుగానే ఉంటుందని తెలుస్తుంది. మరి సాహో సంచలనాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.  Related Post

సినిమా స‌మీక్ష