అల్లు అర్జున్, త్రివిక్రం మూవీ టైటిల్ అదేనా..?

March 14, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు హారిక హాసిని క్రియేషన్స్ లో ఎస్. రాధాకృష్ణతో పాటుగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమాకు టైటిల్ గా నాన్న నేను అని పెట్టబోతున్నారట. సినిమా టైటిల్ పై ఎలాంటి రూమర్స్ లేకుండా ఉండేందుకు సినిమా ఓపెనింగ్ రోజే టైటిల్ ఎనౌన్స్ చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో వస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఫాదర్ సెంటిమెంట్ తోనే వచ్చింది. ఇప్పుడు అదే ఫాదర్ సెంటిమెంట్ తో డిఫరెంట్ కథతో ఈ సినిమా వస్తుందట. అరవింద సమేత తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. 

 


Related Post

సినిమా స‌మీక్ష