విజయ్ దేవరకొండ సినిమాకు కష్టాలు..!

March 13, 2019


img

యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ సినిమాను లైన్ లో పెట్టాడు. దీనితో పాటుగా ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. షాలిని రెడ్డి హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా 'హీరో' అని పెట్టారు. 

తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో ఈ టైటిల్ కు ఎలాంటి ఇబ్బంది లేదు కాని తమిళంలో ఇదే టైటిల్ తో ఆల్రెడీ ఓ సినిమా చేస్తున్నాడు. పిఎస్ మిత్రన్ డైరక్షన్ లో శివ కార్తికేయన్ హీరోగా ఈ సినిమా వస్తుంది. మరి తమిళ వర్షన్ ఒక్కదానికే టైటిల్ మార్చుతారా లేక అన్ని భాషల్లో విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ మార్చేస్తారా అన్నది చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష